సీతారామరాజు ఏ ట్రూ వారియర్

రిసాలి ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియో నిర్మాణంలో సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం "సీతారామరాజు" - ఏ ట్రూ వారియర్. ఈ చిత్రం వివరాలు ఈరోజు మీడియా మీట్ లో వెల్లడించారు.

రిసాలి ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియో అధినేత... డా. శ్రీనివాస్ మాట్లాడుతూ.... సొంతూరు, గంగపుత్రులు, గల్ఫ్ వంటి సామాజిక చిత్రాలను.... రొమాంటిక్ క్రైమ్ కథ, క్రిమినల్ ప్రేమ కథ వంటి యూత్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో "సీతారామరాజు" - ఏ ట్రూ వారియర్ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా రిసాలి ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియో శ్రావ్యఫిలింస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. 7.1 స్టూడియో తో పాటు టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ తో స్టూడియో నిర్మాణం చేశాం. ఎలాంటి సినిమాకైనా సరే పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ చేసుకునే విలు రిసాలీ స్టూడియోలో ఉంది. ప్రతీ సంవత్సరం రెండు చిత్రాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాం. అని అన్నారు.

దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.... ఆంధ్రప్రదేశ్ లోనే తొలిసారిగా పూర్తి పోస్ట్ ప్రొడక్షన్ వసతులతో స్టూడియో ఏర్పాటు చేసిన రిసాలి ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియో అధినేత శ్రీనివాస్ తో కలిసి శ్రావ్యఫిలింస్ బ్యానర్లో సీతారామరాజు వంటి బయోపిక్ తీయడం చాలా సంతోషంగా ఉంది. అప్పటి చరిత్రతో ఇప్పటి యువతకి స్ఫూర్తి నింపేలా అల్లూరి సీతారామరాజు త్యాగం ఆయన కీర్తిని మరింత ఇనుమడింపజేసే దిశగా "సీతారామరాజు" - ఏ ట్రూ వారియర్ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం

విశాఖ, కాకినాడ, రాజమండ్రి, ఏజెన్సీల పరిసర ప్రాంతాల్లో సింహ భాగం షూటింగ్ జరుపుకునే ఈ చిత్రానికి మార్తాండ్ కె వెంకటేష్, సాబు జేమ్స్ వంటి సీనియర్ సాంకేతిక నిపుణుల బృందం పనిచేస్తుంది. రావ్ రమేష్ వంటి సీనియర్ నటీనటులతో పాటు... నూతన నటీనటులు కూడా ఇందులో నటిస్తారు.

నిర్మాత యెక్కలి రవీంద్రబాబు మాట్లాడుతూ... మా బ్యానర్లో ఇది చాలా పెద్ద సినిమా.. ఈ సినిమాను పెద్ద స్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. ఓ అద్భుతమైన సినిమా వస్తుందని ఆశిస్తున్నాను. అని అన్నారు.