Sunil Kumar Reddy - Risali Institute of Management

సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రిసాలీ సంస్థలో ప్రతిష్టాత్మకంగా సీతారామరాజు చిత్రం నిర్మిస్తున్నాం – నిర్మాత డా. శ్రీనివాస్

సైకాలజిస్ట్ గా, విద్యావేత్తగా, బిజినెస్ మెన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు… రిసాలి ఫిల్మ్ అకాడమీ అధినేత డా.శ్రీనివాస్. దాదాపు 27 ఏళ్లుగా ఆయన విద్యారంగంలో పలు విభాగాల్లో ప్రతిభను చాటుకున్నారు. ఎంతోమంది విద్యార్థుల్ని ఏవియేషన్, హోటల్ మేనేజ్ మెంట్ విద్యలో నిపుణుల్ని తయారు చేశారు. ఇక ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్, మీడియా రంగంలోకి అడుగు పెట్టారు. రిసాలి ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియో నిర్మాణం చేపట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలిసారిగా పూర్తిస్థాయి పోస్ట్ ప్రొడక్షన్ చేసుకునే విధంగా తీర్చి దిద్దారు. క్లాస్ రూముల్లో పాఠాలు మాత్రమే నేర్పించకుండా ప్రాక్టికల్ గాను విద్యార్థుల్ని నిష్ణాతుల్ని చేయాలనే ఉద్దేశ్యంతో సీతారామరాజు బయోపిక్ నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా

రిసాలి ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియో అధినేత మాట్లాడుతూ…. నేను సైకాలజీలో డాక్టరేట్ తీసుకున్నాను. ఆతర్వాత చాలా కాలేజీల్లో లెక్చరర్ గా పని చేశాను. విద్యారంగంలో దాదాపు 27 ఏళ్లుగా కొనసాగుతున్నాను. స్పోకెన్ ఇంగ్లిష్ ఇనిస్టిట్యూట్స్ స్థాపించాను. అలాగే ఏవియేషన్, హోటల్ మేనేజ్ మెంట్ స్పెషలైజేషన్స్ తో రిసాలి సంస్థను నెలకొల్పాం. మా దగ్గర చదువుకున్న విద్యార్థులు ఇప్పుడు పలు పేరు పొందిన కంపెనీల్లో పనిచేస్తున్నారు. మలేషియాలో కూడా మా సంస్థలున్నాయి. ఇక ఇప్పుడు ఫిల్మ్ రంగంలోకి అడుగుపెట్టాం. దీని కోసం ముందుగా రిసాలి ఫిల్మ్ అకాడమీని వైజాగ్ లో స్థాపించాం. ప్రముఖ దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఈ శిక్షణా సంస్థను స్థాపించాం. రిసాలీ ఫిల్మ్ అకాడమీ చూసి పలువురు సెలెబ్రిటీస్ మెచ్చుకున్నారు. వెంకటేష్ గారు కూడా మా అకాడమీని విజిట్ చేశారు. థియరీ క్లాసులతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ద్వారా విద్యను అందించడమే మా టార్గెట్. అందుకే సీతారామరాజు అనే సినిమా తీస్తున్నాం. ఈ సినిమా కోసం మా విద్యార్థులు కూడా పనిచేయనున్నారు. 7.1 స్టూడియో తో పాటు టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ తో స్టూడియో నిర్మాణం చేశాం. విద్యను అందించమే కాదు.. ఎలాంటి సినిమాకైనా సరే పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ చేసుకునే విలు రిసాలీ స్టూడియోలో ఉంది. ప్రతీ సంవత్సరం రెండు చిత్రాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాం. మన్యంలో జరుగుతున్న తెల్లదొరల ఆకృత్యాలకు నిరసనగా విప్లవ బావుటా ఎగరవేసిన పాతికేళ్ల కుర్రాడి పోరాట గాథను ఉత్తమ సాంకేతిక విలువలతో తెరకెక్కించనున్నాం. అల్లూరి సీతారామరాజు బయోపిక్ తీయడం చిన్న విషయం కాదు. దానికి కావాల్సిన సీజీ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశాం. మా రిసాలి ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియో శ్రావ్యఫిలింస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ కోసం పలు సంస్థలు మాతో కలిసి వర్క్ చేసేందుకు ముందుకు వస్తున్నాయి. కేవలం డబ్బు సంపాదించటమే నా థ్యేయం కాదు. మంచి నైపుణ్యం గల విద్యార్థుల్ని వెలికితీసి సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనేదే మా తపన. అప్పటి చరిత్రతో ఇప్పటి యువతకి స్ఫూర్తి నింపేలా అల్లూరి సీతారామరాజు త్యాగం ఆయన కీర్తిని మరింత ఇనుమడింపజేసే దిశగా “సీతారామరాజు” – ఏ ట్రూ వారియర్ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. విశాఖ, కాకినాడ, రాజమండ్రి, ఏజెన్సీ ల పరిసర ప్రాంతాల్లో సింహ భాగం షూటింగ్ జరుపుకునే ఈ చిత్రానికి మార్తాండ్ కె వెంకటేష్, సాబు జేమ్స్ వంటి సీనియర్ సాంకేతిక నిపుణుల బృందం పనిచేస్తుంది. రావ్ రమేష్ వంటి సీనియర్ నటీనటులతో పాటు… నూతన నటీనటులు కూడా ఇందులో నటిస్తారు. మే లో షూటింగ్ ప్రారంభమౌతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సునీల్ కుమార్ రెడ్డి గారు ఏ సినిమా చేసినా చాలా రీసెర్చ్ వర్క్ చేస్తుంటారు. అలాంటి అల్లూరి సీతారామరాజు బయోపిక్ చేస్తున్నప్పుడు ఏ విధమైన గ్రౌండ్ వర్క్ చేస్తారో ఊహించొచ్చు. ఈ సినిమాను పెద్ద స్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆయన నుంచి ఓ అద్భుతమైన సినిమా వస్తుందని ఆశిస్తున్నాను. అని అన్నారు.